Prakash Raj: బహుభాష విధానంపై పవన్‌కు ప్రకాష్‌రాజ్ కౌంటర్

Prakash Raj: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నటుడు ప్రకాష్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
నటుడు ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please..’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇక, అంతకుముందు పవన్ కల్యాణ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది.
తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు జాతీయ విద్యావిధానంపై తమిళనాడు, కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూపాయి సింబల్‌ను తొలగించారు. ఆ స్థానంలో తమిళనాడులో ‘రూ’ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చారు.
దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. తమిళ సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకొనేందుకు తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. కాగా మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని మండిపడ్డారు. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషను సబ్జెక్టుగా చేర్చడాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.