సినిమా

Pragathi: విమర్శలకు తన పతకాలే సమాధానమంటున్న ప్రగతి!

Pragathi: నటి ప్రగతి టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఒక బంగారు, మూడు రజత పతకాలు సాధించింది. “ఈ వయసులో అవసరమా?” అని ట్రోల్ చేసినవారికి ఆమె గట్టిగా బదులిచ్చింది. త్రీ రోజెస్ సీజన్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ప్రగతి మళ్లీ సరికొత్త రికార్డు సృష్టించింది. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలతో నాలుగు పతకాలు సాధించి అందరి మనసులు గెలుచుకుంది. గత కొంతకాలంగా పవర్‌లిఫ్టింగ్‌పై దృష్టి పెట్టిన ఆమె జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు పతకాలు సాధించి మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఈ విజయంతో సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతోంది.

సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతుంటే కొందరు మాత్రం వయసు గురించి విమర్శలు చేశారు. త్రీ రోజెస్ సీజన్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రగతి ఆ ట్రోలర్స్‌కి నేరుగా బదులిచ్చింది. జిమ్‌కి జిమ్ బట్టలే వేప్కోవాలని, చీరలో చేయలేమని, ఈ వయసులో అవసరమా అన్న వారికి ఇప్పుడు సమాధానం వచ్చిందని ధైర్యంగా చెప్పింది. తన కూతురు కోసం కూడా ఆందోళన చెందినా ఇప్పుడు గర్వంగా ఉందని తెలిపింది. ఆమె మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button