ఆంధ్ర ప్రదేశ్
Duvvada Srinivas: కూటమి ప్రభుత్వం కావాలనే ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు

Duvvada Srinivas: కూటమి ప్రభుత్వం కావాలనే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ . అసెంబ్లీ సెషన్‌లో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ ప్రసంగం సమయంలో వైసిపి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.
గతంలో అన్యాయం జరిగితే ప్రశ్నిస్తా ఆన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలి అంటున్న వైసిపి ఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాస్.