Prabhas: బాలీవుడ్ బిగ్ సినిమాని రిజెక్ట్ చేసిన ప్రభాస్

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ ధూమ్ 4ను తిరస్కరించినట్లు సమాచారం. ఆయన తన ప్రస్తుత ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. దీంతో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇతర సౌత్ స్టార్స్‌ను సంప్రదిస్తున్నారు.
ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చే వార్త వచ్చింది. బాలీవుడ్ యాక్షన్ సిరీస్ ధూమ్ 4లో ప్రభాస్ నటించబోతున్నాడనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. కానీ, ఆయన ఈ ప్రాజెక్ట్‌ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నారు. సలార్ 2, స్పిరిట్ వంటి భారీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇతర సౌత్ స్టార్స్‌ను సంప్రదిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి వారి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ధూమ్ సిరీస్ అభిమానులు ఈ కొత్త అప్‌డేట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



