Prabhas-Prem Rakshit: ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్లో ప్రభాస్ మూవీ?

Prabhas-Prem Rakshit: ఆర్ఆర్ఆర్ నాటు పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డాన్సర్ ప్రేమ్ రక్షిత్ తొలిసారిగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్‌ను తన స్క్రిప్ట్‌తో ఆకట్టుకున్న ఈ డాన్స్ మాస్టర్‌కు ప్రభాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
రాజమౌళి సినిమాల్లో ఎన్నో హిట్ పాటలకు కొరియోగ్రఫీ అందించిన ప్రేమ్ రక్షిత్ ఇప్పుడు దర్శకుడిగా అరంగేట్రం చేయనున్నారు. ఒక పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో ప్రభాస్‌ను ఆకర్షించిన ఆయనకు కథ విన్న వెంటనే రెబల్ స్టార్ ఓకే చెప్పారట. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి రానుంది.
ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ లైనప్‌లో మరో భారీ ప్రాజెక్టు జోడయింది. డెబ్యూ దర్శకుడితో ప్రభాస్ చేయడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.



