Prabhas: పువ్వుల మధ్య కూల్‌గా ప్రభాస్!

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కొత్త ఫోటోషూట్ సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. ప్రభాస్ అరుదుగా ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తారు. ఇప్పుడు సింపుల్ బ్లాక్ డ్రెస్‌లో క్యాజువల్ లుక్‌లో కనిపిస్తూ వింటేజ్ డార్లింగ్‌ను గుర్తు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఉదయం నుంచి ఎక్కడ చూసినా ఈ ఫోటోలే కనిపిస్తున్నాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ఇలా ప్రత్యేక ఫోటోషూట్ చేయడం చాలా అరుదు. సాధారణంగా ఈ మధ్య కాలంలో ప్రభాస్‌ను గంభీరమైన ముఖం, భారీ యాక్షన్ ఇమేజ్‌తోనే చూస్తుంటాం. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి చిత్రాల్లో సీరియస్ లుక్‌తో కనిపించారు. కానీ చాలా కాలం తర్వాత ఈ ఫోటోల్లో ప్రభాస్ అత్యంత కూల్‌గా, రిలాక్స్‌డ్‌గా కనిపిస్తున్నారు.
సింపుల్ బ్లాక్ డ్రెస్ ధరించి, సోఫాలో క్యాజువల్‌గా కూర్చొని నవ్వుతున్న ఆయన తీరు ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ లుక్ చూస్తుంటే ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ రోజులు గుర్తొస్తున్నాయి. పువ్వుల మధ్య ఈ వింటేజ్ స్టైల్ ఫ్యాన్స్‌కు పండగలా మారింది. ప్రభాస్ ఇలాంటి రిలాక్స్‌డ్ ఫోటోలు షేర్ చేయడం ఫ్యాన్స్‌కు ఆనందాన్ని కలిగిస్తోంది.



