తెలంగాణ
నేడు సిట్ అధికారుల ఎదుటకు ప్రభాకర్ రావు

నేడు సిట్ అధికారుల ఎదుట SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్కు వచ్చారు ప్రభాకర్ రావు. ఈయన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆరోపణలతో ప్రభాకర్ రావు అమెరికాకు పరారు అయ్యారు.
అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్కు వచ్చారు. రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన ప్రభాకర్ రావు నేరుగా తన నివాసానికి వెళ్లారు. అరెస్ట్ నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో భారత్కు వచ్చారు. నేడు సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు.