ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

Vijayawada: ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 2025 దసరా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను దుర్గగుడి ఈవో శీనా నాయక్ ఆవిష్కరించారు. ఈ సారి కూడా ప్రతిఏడు లాగే దసరా ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. ఈ ఏడాది 11 రోజుల పాటు విశేషంగా దసరా ఉత్సవాలు జరుగుతాయన్నారు.



