ఆంధ్ర ప్రదేశ్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితులు విదేశాలు పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనుచరులు కొమ్మ కోట్ల, రంగాతో పాటు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు కిడ్నాపర్ కారుతో పాటు మొబైల్ సీజ్ చేశారు. అయితే కిడ్నాప్‌కు సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల సహకారం ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
కిడ్నాప్ కేసులో భాగంగా నేడు న్యాయమూర్తికి ఎదుట సత్యవర్ధన్ హాజరుకానున్నారు. మరోవైపు వంశీని విచారించేందుకు.. పది రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు . అయితే ఇవాళ పోలీసులు వేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది. అలాగే వంశీ తరపు అడ్వకేటు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం.