సినిమా

కాసేపట్లో ఓబులవారిపల్లె పీఎస్‌కి పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali: కాసేపట్లో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌కు పోసాని కృష్ణమురళిని తరలించనున్నారు పోలీసులు. విచారణ తర్వాత రాజంపేట కోర్టులో హాజరుపరిచే అవకాశం కన్పిస్తోంది. నిన్న రాత్రి హైదరాబాద్‌లో పోసానిని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు APFTVDC ఛైర్మన్‌గా పనిచేసిన పోసాని విపక్ష నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు మంత్రి నారా లోకేష్‌ను అసభ్యకరంగా దూషించారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే కులాల పేరుతో తిట్టడం, ప్రజల్లో విభేదాలు సృ ష్టించారని ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదుతో.. పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు నమోదు చేశారు. అలాగే రైల్వేకో డూరులో కూడా పోసానిపై కేసు నమోదైనట్లు సమాచారం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button