తెలంగాణ
నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల

కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణలో భాగంగా బీఆర్‌కే భవన్‌కు చేరుకున్నారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. 20 కార్ల భారీ కాన్వాయ్‌తో కార్యాలయానికి వెళ్లారు ఈటల. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన ఈటల పలు పేపర్లను తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విచారణ కార్యాలయానికి కార్యకర్తలు ఎవరూ రావొద్దని ఈటల రాజేందర్ ఇప్పటికే సూచనలు చేశారు.
ఇక కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. ముఖ్యంగా గతంలో నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా విచారణ చేపట్టినట్లు సమాచారం. ఇక కమిషన్ ఎదుట ఈటల ఏం చెబుతున్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.