Poonam Kaur: త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ షాకింగ్ ఆరోపణలు.. ఆధారాలతో సంచలనం!

Poonam Kaur: సినీ నటి పూనమ్ కౌర్ మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్‌లు ఇండస్ట్రీలో కలకలం రేపుతున్నాయి. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.
టాలీవుడ్‌లో మరో వివాదం రాజుకుంది. నటి పూనమ్ కౌర్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లతో, “త్రివిక్రమ్‌ను వదిలే ప్రసక్తే లేదు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి” అని ఆమె స్పష్టం చేశారు. ‘మా’ అసోసియేషన్‌కు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినప్పటికీ, స్పందన లేకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నా జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకపోతే ఎక్కడికి వెళ్లాలి?” అని ఆమె ప్రశ్నించారు. త్రివిక్రమ్ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలపై త్రివిక్రమ్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. సోషల్ మీడియాలో పూనమ్ పోస్ట్‌లు వైరల్‌గా మారడంతో, ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందన్న చర్చ జోరందుకుంది.