పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు!

Poonam Kaur: నటి పూనమ్ కౌర్ కడప నుంచి వచ్చిన వ్యక్తులు తనను బెదిరించారని సంచలన ఆరోపణలు చేసింది. ఒక నటుడిపై ప్రెస్ మీట్ పెట్టమని డిమాండ్ చేశారని వెల్లడించింది. డబ్బు, పదవి ఆశ చూపి, తిరస్కరించగా న్యూడ్ వీడియోలు బయటపెడతామని బెదిరించారట. పోసాని మాటల వల్ల వ్యక్తిగత జీవితం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.
తెలుగు సినిమాల్లో నటించిన పూనమ్ కౌర్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. కడప నుంచి వచ్చిన కొందరు తనను బెదిరించారని చెప్పింది. ఒక నటుడికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలని డిమాండ్ చేశారట. ముందు డబ్బు ఆఫర్ చేసి, తర్వాత పదవి ఆశ చూపారని తెలిపింది.
వీటికి లొంగకపోతే న్యూడ్ వీడియోలు బయటపెడతామని బెదిరించారట. ఈ విషయం కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ చెప్పలేదని పూనమ్ వెల్లడించింది. మరోవైపు పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్లో తన గురించి దారుణంగా మాట్లాడడం వల్ల వ్యక్తిగత జీవితం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేసింది. పెళ్లి ప్రయత్నాలు ఆగిపోయాయని, చాలా నష్టపోయానని చెప్పింది. ఈ ఆరోపణలు టాలీవుడ్లో చర్చనీయాంశమైనాయి.



