తెలంగాణ
Ponnam: అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

Ponnam: రేషన్ కార్డుల జారీ, మార్పులు చేర్పుల ప్రక్రియ.. నిరంతరం జరిగేలా సాఫ్ట్ వేర్‌ను రూపొందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని 15వ వార్డులో ప్రజా పాలన వార్డు సభలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తన జోక్యం ఉండదని, న్యాయంగా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామన్నారు.
అధికారులు ప్రజా పాలన సభల్లో ప్రతి ఒక్కరి నుండి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. 2 లక్షలకు పైగా ఇంకా రుణమాఫీ కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తామన్నారు పొన్నం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, అయితే సమస్యను ముందు అధికారుల దృష్టికి తన దృష్టికి తీసుకురావాలన్నారు.