తెలంగాణ
Ponnam Prabhakar: అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన

Ponnam Prabhakar: ప్రజల ఆకాంక్షలతో ఏర్పడిన ప్రభుత్వం తమదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు . పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అమరవీరులకు నివాళులర్పించారు. సాధించుకున్న తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజా పాలన అందిస్తున్నామన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.



