తెలంగాణ
Ponnam Prabhakar: అర్హులందరికి రేషన్ కార్డులు వస్తాయి

Ponnam Prabhakar: కుల సర్వే అప్లికేషన్‌ల సమాచారం ఆధారంగా.. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తిలో పొన్నం పర్యటించారు.
జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే నిర్వహించారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేకుండా చేశారని విమర్శించారు. ప్రతిపక్షాలు కావాలని రాజకీయం చేసి రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.