తెలంగాణ
Hyderabad: జీహెచఎంసీ కార్యాలయంలో సమీక్షా.. మంత్రి పొన్నం నేతృత్వంలో సమావేశం

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియపై హైదరాబాద్ జీహెచఎంసీ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ కానుక, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు.
వాటిని విజయవంతం చేయడానికి జిల్లాల వారిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క లబ్దిదారుడికి పథకాలు అమలయ్యేలా చూడాలని పొన్నం ఆదేశించారు.