తెలంగాణ
వేములవాడలో కొత్తరకం సైబర్ మోసాలు

Vemulawada: వేములవాడలో కొత్తరకం సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ ఎస్ ఐ ఫోటో పెట్టుకొని ట్రాఫిక్ చాలన్ ఉందంటూ హ్యాకర్లు యాప్ ద్వారా లింకు పంపారు. లింక్ ఓపెన్ చేశాక హ్యాకర్ల చేతికి డబ్బు పోవడంతో మోసపోయామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈఆర్టిఏ యాప్ ద్వారా ఛలాన్ పెండింగ్ ఉందని వస్తే నమ్మొద్దని, వెహికల్ ఛలాన్ ఉంటే అప్పుడే వారికి మెసేజ్ వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. పొరపాటున కూడా యాప్లను డౌన్లోడ్ గాని, ఓపెన్ గాని చేయొద్దని పోలీసులు కోరుతున్నారు.



