తెలంగాణ
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపికబురును అందించింది. ఈ క్యాలెండర్ సంవత్సరం 2026 నుండి 2.1శాతం DA ను పెంచుతున్నట్లు ప్రకటించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంతకు ముందు 50.7శాతం DA ఉండగా, ఇపుడు దాన్ని 52.8శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. పెరిగిన DA జనవరి 1, 2026 నుండి అమల్లోకి వచ్చినట్లు తెలిపారు.
గడిచిన మూడు నెలలకు గాను ఒక్కోనెలలో సప్లిమెంటరీ బిల్స్ ద్వారా ప్రభుత్వం చెల్లించనున్నది. పెరిగిన డీఏ ద్వారా ఆర్టీసీ పై ప్రతి నెల 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఆర్టీసీ సిబ్బంది ఎన్నోరోజులనుంచి ఎదురుచూస్తున్న డీఏ ను ప్రకటించడం సంతోషకరమని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ ప్రధాన ధ్యేయని చెప్పారు.



