తెలంగాణ
రాంచందర్‌రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్

Ramachandra Rao: బీజేపీ చీఫ్ రాంచందర్‌రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైరయ్యారు. బీజేపీ అధ్యక్షుడు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధ్యమేనని అన్నారు. ఎందుకు రిజర్వేషన్లు అమలు కావో చూస్తామని అన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు తప్పకుండా 9వ షెడ్యూల్‌లో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. రిజర్వేషన్ల అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 42శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.