తెలంగాణ
Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్‌కు మరోసారి ప్రజలు బుద్ధి చెప్తారు

Ponguleti Srinivasa Reddy: ప్రభుత్వం సంక్షేమ పథకాలు తెస్తుంటే.. కొంతమంది విషం కక్కుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. పాముకు కోరల్లో విషం ఉంటే, కొందరి నాయకులకు ఒళ్ళంతా విషం ఉంటుందని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు రెండు పర్యాయాలు బుద్ధి చెప్పారని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు.
మూడున్నర సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల గురించి ట్విట్టర్ టిల్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ సత్తా చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కాంగ్రెస్ వచ్చాక జరుగుతుందని స్పష్టంచేశారు.



