తెలంగాణ
తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్

వికారాబాద్ జిల్లా కొడంగల్, తాండూరు నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తాండూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో ఉన్న 149 గ్రామపంచాయతీ స్థానాలు,1228 వార్డులకు గాను 33 గ్రామపంచాయతీల ఎన్నికలు ఏకగ్రీవం కాగా మిగిలిన స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
కొడంగల్ నియోజకవర్గంలోని 255 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. ఎన్నికల సందర్భంగా 1100 పైగా పోలీస్ సిబ్బంది పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్నారు.



