తెలంగాణ
నేడు తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు

తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇప్పటికే 415 సర్పంచ్ స్థానాలు, 8వేల 307 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 3వేల 911 పంచాయతీలు, 29 వేల 917 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
సర్పంచ్ పదవులకు 12వేల782 మంది అభ్యర్దులు పోటీ పడనున్నారు. వార్డుల బరిలో 71వేల 071 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది.



