తెలంగాణ
తెలంగాణలో కొత్త జిల్లాలపై పొలిటికల్ వార్

తెలంగాణలో కొత్త జిల్లాలపై పొలిటికల్ వార్ స్టార్ అయింది. జిల్లాల విభజనపై కమిటీ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త జిల్లాలను రద్దు చేస్తే..బీఆర్ఎస్ ఉద్యమం చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
వనపర్తి, గద్వాల, నారాయణ పేట జిల్లాలను రద్దు చేస్తామంటున్నారని అన్నారు. పాలన సౌలభ్యం కోసం ఉమ్మడి పాలమూరును 5 జిల్లాలు చేశామని తెలిపారు. ప్రజలకు పాలన దగ్గర చేయాల్సింది పోయి దూరం చేస్తామంటున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.



