ఆంధ్ర ప్రదేశ్
మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసుల హెచ్చరిక

మారేడుమిల్లి వెళ్లే పర్యాటకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అడవిలోకి వెళ్లొద్దని పర్యాటకులకు వార్నింగ్ ఇస్తున్నారు. అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ల్యాండ్ మైన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పర్యాటకులను అటవీ ప్రాంతంలో తిరగొద్దని హెచ్చరిస్తున్నారు.



