ఆంధ్ర ప్రదేశ్
Kakinada: నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు

కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చింతలూరు గ్రామ శివారులో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సారా కాస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 60 లీటర్ల నాటుసారా, 3000 లీటర్లు పులిసిన బెల్లపు ఊట, నాటుసారా తయారీ సామాగ్రి ధ్వంసం చేశారు. నాటుసారా కాచిన లేక రవాణా చేసినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.



