ఆంధ్ర ప్రదేశ్
రౌడీషీటర్‌కు వినూత్న రీతిలో పోలీసుల ట్రీట్మెంట్

కృష్ణ జిల్లా పెనమలూరు పోలీసులు ఓ రౌడీషీటర్‌కు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. రౌడీషీటర్ కేటీఎం పండుని పోరంకి నుండి కిలోమీటర్ పైగా రోడ్డుపై నడిపించారు పోలీసులు. గతంలో పండుపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల జైలు నుంచి వచ్చిన పండు డబ్బుల విషయంలో శివకుమార్ అనే వ్యక్తిపై పండు గ్యాంగ్ దాడికి పాల్పడింది. దీంతో పండు అతని అనుచరులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.



