తెలంగాణ
పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో పోలీసుల కార్డెన్ సెర్చ్

హైదరాబాద్ పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. 620 ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు. 300 నిషేధిత గుట్కా ప్యాకెట్లు, సరైన పత్రాలు లేని 38 బైకులను అధికారులు సీజ్ చేశారు.
అనుమతి లేకుండా అక్రమంగా విక్రయిస్తున్న 74 మద్యం సీసాలతో పాటు 63 గ్యాస్ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న రౌడీషీటర్, ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీసీపీ కోటిరెడ్డి తెలిపారు.