నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. రియాజ్‌ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి రియాజ్ గన్ను లాక్కునే ప్రయత్నం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు కావడంతో రియాజ్‌పై పోలీసులు కాల్పులు జరిపారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రియాజ్ చనిపోయాడు. అక్టోబర్ 17న సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ పొడిచి చంపాడు. నిజామాబాద్‌లో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్‌ను హత్య చేసిన రియాజ్ అరబ్‌ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నగర శివారులోని ఓ పాత లారీ క్యాబిన్లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఈ ఉదయం పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్సరే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై ఆయనపై కాల్పులు జరిపాడు. ఇప్పటికే వైలెంట్ ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్‌ను పొట్టన పెట్టుకున్నాడు.
మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు ఆత్మరక్షణ కోసం ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రియాజ్ ఆసుపత్రిలోనే హతమయ్యాడు. ఇవాళ గన్‌తో పాటు వెళ్లిపోయే క్రమంలో దాడికి యత్నించాడని అందుకే తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందని అన్నారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అంటున్నారు.



