Kamal Haasan: కమల్‌పై పోలీస్ కేసు?

Kamal Haasan: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో వివాదానికి దారితీశాయి. “తమిళం నుంచే కన్నడం పుట్టింది” అన్న కామెంట్స్‌తో కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమల్‌పై పోలీస్ కేసు నమోదైంది. ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొంది.
కమల్ హాసన్ తాజా చిత్రం ‘థగ్ లైఫ్’ ప్రమోషన్‌లో భాగంగా బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను గాయపరిచాయి. “కన్నడ భాష తమిళం నుంచి ఉద్భవించింది” అని పేర్కొనడంతో కర్ణాటక రక్షణ వేదిక ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కన్నడ భాషను అవమానించారంటూ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో నిరసనలు ఊపందుకున్నాయి.
‘థగ్ లైఫ్’ సినిమాను నిషేధించాలని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. కమల్ మాత్రం తన వ్యాఖ్యలు ప్రేమతో కూడినవని, క్షమాపణ అవసరం లేదని స్పష్టం చేశారు. జూన్ 5న విడుదల కానున్న ఈ చిత్ర రిలీజ్‌పై అనిశ్చితి నెలకొంది. కమల్ క్షమాపణ చెప్పకపోతే వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.