ఆంధ్ర ప్రదేశ్
Kadapa: బాలికను గర్భవతి చేసిన యువకుడిపై పోక్సో కేసు నమోదు

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. మైనర్ బాలికను గర్భవతి చేశాడు సుధాకర్ అనే వ్యక్తి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సుధాకర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. సుధాకర్‌కి టెంట్ ఏజెన్సీ ఉన్నట్లు చెబుతున్నారు పోలీసులు.
బాలిక టెంట్ ఏజెన్సీ పక్కన ఉన్న దోశ సెంటర్లో పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే సుధాకర్ రోజూ హోటల్‌కి వచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా బాలిక ఆరు నెలల గర్భవతి అని చెప్పడంతో పేరెం ట్స్ ఆందోళన చెందుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.