ఆంధ్ర ప్రదేశ్
POCSO: బాలికకు వేధింపులు.. పాస్టర్‌పై పోక్సో కేసు

POCSO: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కొద్ది నెలల క్రితం చర్చికి ప్రార్థన కోసం వచ్చిన బాలికపట్ల పాస్టర్ సుధీర్‌కుమార్ అసభ్యకరంగాప్రవర్తించాడు. పాస్టర్ సుధీర్‌కుమార్‌పై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
దీంతో పాస్టర్ సుధీర్ కుమార్‌పై పోక్సో కేసు నమోదు అయింది. అంతటితో ఆగకుండా పాస్టర్ బాలిక కనపడినప్పుడల్లా ఆమెను బెదిరిస్తూ, వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు తెలిపారు. పాస్టర్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.



