జాతియం
Modi: మహానేతల విగ్రహాలు ఆవిష్కరించిన ప్రధాని మోడీ

Modi: యూపీలోని లక్నోలో ప్రధాని మోడీ పర్యటించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయల విగ్రహాలను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రేరణ స్థల్‌ను దేశ మహానేతల జీవితాలు, ఆదర్శాలను స్మరించుకునేలా రూపొందించారు. ఆర్టికల్ 370 రద్దుతో శ్యాం ప్రసాద్ స్వప్నాన్ని సాకారం చేశామని ప్రధాని మోడీ అన్నారు.
జమ్ముకశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని అమలు చేశామన్నారు. కోట్లాది మందిని పేదరికం నుంచి విముక్తి చేశామన్నారు. గతంలో ఒకే కుటుంబం పేరుతో పథకాలు అమలు చేశారని ఆయన విమర్శించారు. మా ప్రభుత్వం మహనీయులను గౌరవిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు.



