జాతియం

PM Modi: విదేశీ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ

PM Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఎనిమిది రోజులపాటు ఐదు దేశాల్లో పర్యటించనున్నారు ప్రధాని. ఘానా, ట్రినిడాడ్ అండ్ టొబాగోతోపాటు అర్జెంటీనా బ్రెజిల్, నమీ బియాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.

ఇవాళ, రేపు ఘానాలో మోదీ పర్యటించనున్నారు. అయితే మూడు దశాద్దాల తర్వాత ఘానాలో భారత ప్రధాని పర్యటించడం తొలిసారి. అదేవిధంగా రేపు, ఎల్లుండి ట్రినిడాడ్-టొబాగో లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఇక ఈనెల 4, 5 తేదీల్లో అర్జెంటీనాకు వెళ్లనున్నారు ప్రధాని. అక్కడ రక్షణ, వ్యవసాయం, గనులపై అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలేతో చర్చించనున్నారు.

ఈనెల 6, 7 తేదీల్లో బ్రిక్స్ 17వ సదస్సు జరుగనుంది. ఈ బ్రిక్స్ 17వ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. పహల్‌గామ్ దాడి ఘటనను ఖండించనున్న బ్రిక్స్ సదస్సు భారత ప్రతిపాదన మేరకు ఒక తీర్మానం చేయనుంది. ఇక ఈనెల 9న నమీబియాకు వెళ్లనున్న ప్రధాని మోదీ నమీబియాలో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. గత 11 ఏళ్లలో మోదీ సుదీర్ఘ దౌత్య పర్యటనలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button