జాతియం
PM Modi: కెనడాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ

PM Modi: సైప్రస్ నుండి బయల్దేరిన ప్రధాని మోదీ కెనడాకి చేరుకున్నారు. ఇవాళ, రేపు కెనడాలో మోదీ విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జీ7 సదస్సులో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. మరోవైపు జీ7 సదస్సు నుంచి ముందుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిష్క్రమించనున్నారు.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో జీ7 సదస్సు పర్యటనను ట్రంప్ కుదించుకున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రాత్రికి వాషింగ్టన్ చేరుకోనున్నారు ట్రంప్. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది వైట్‌హౌస్.