జాతియం
Kite Festival: అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్.. పతంగి ఎగుర వేసిన ప్రధాని మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో కలిసి ఆయన గాలిపటం ఎగురవేశారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా గుజరాత్‌కు వచ్చిన మెర్జ్, ప్రధాని మోదీని కలిశారు. అనంతరం సబర్మతి నదీతీరంలో జరిగిన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో ఇద్దరు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమంతుడి చిత్రంతో ఉన్న గాలిపటాన్ని వారు ఎగురవేశారు.



