అంతర్జాతీయం
Florida: రోడ్డుపై వెళ్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన విమానం

Florida: అమెరికాలోని ఫ్లోరిడాలో అనూహ్య ఘటన జరిగింది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం వెనుక నుంచి ఢీకొట్టింది. బ్రెవర్డ్ కౌంటీ వద్ద ఇంటర్ స్టేట్ నేషనల్ హైవేపై ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారిపై హఠాత్తుగా ఓ చిన్న విమానం నేలపై వాలిపోయింది. ఈ క్రమంలో అది వేగాన్ని అదుపు చేసుకోలేక ఎదురుగా ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది.
ఈ ఘటనలో కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇప్పుడీ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో పైలట్, ప్రయాణికుడు ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. వీరు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.



