అంతర్జాతీయం

Plane Crash: బిల్డింగ్‌పై కూలిన విమానం.. ఇద్ద‌రు మృతి

Plane Crash: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఒక చిన్నవిమానం ఘోర ప్రమాదానికి గురైంది. ఓ భవనం రూఫ్‌టాప్‌పై ఫ్లైట్ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఫుల్లెర్టోన్‌లోని ఆరెంజ్ కౌంటీ సిటీలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

విమానం కూలిన చోట భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ ఆవరించింది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహకారంతో మంటలను ఆర్పివేశారు. భద్రత నిమిత్తం చుట్టుపక్కల భవనాల్లో జనాలను ఖాళీ చేయించారు. అలాగే.. విమానం కూలిన భవనం కమర్షియల్ సముదాయమని.. బిల్డింగ్ కొంతమేర దెబ్బతిన్నదని అక్కడి పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button