ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై పేర్నినాని విమర్శలు

మంత్రి కేశినేని చిన్నికి ప్రజా సేవ పట్టదని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. దేవుడి భూములు కొట్టేశానని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కూటమి నేతలు పనిగట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రోజు క్లోజింగ్ లెక్కలు చూసుకోవడమే సరిపోతుందని అన్నారు. 2007లో ఎండోమెంట్ కమిషన్ 130 మంది ఆక్షన్‌లో పాల్గొన్నారని 130 మంది ఆక్షన్‌లో పాల్గొంటే తాను భూమి ఎలా కొట్టేస్తానని నిలదీశారు. కావాలంటే భూములపై విచారణ చేయించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.



