Perni Nani: చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలి

Perni Nani: మాజీ మంత్రిపేర్ని నానికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు పేర్ని నాని పై టీడీపీ నేతలు కేసు పెట్టారు. మచిలీపట్నం పోలీస్ స్టేషన్ లో లోకల్ టిడిపి నాయకులు పేర్ని నానిపై ఫిర్యాదు చేశారు. కూటమి ప్రభుత్వంపై రప్పా రప్పా అంటూ హాట్ కామెంట్స్ చేశారు పేర్ని నాని. అయితే ఆ వ్యాఖ్యల పైన పేర్ని నాని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేసు పెట్టారు టిడిపి నేతలు. కూటమి ప్రభుత్వంపై పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు .
రెడ్ బుక్ కు దీటుగా రప్పా రప్పా అంటే వాళ్లకు మనకు తేడా ఏంటి అని అన్నారు. చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలి అంటూ వ్యాఖ్యానించారు. జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని అన్నారు. అప్పటి వరకు రప్పా రప్పా బంద్ చేయాలని వెల్లడించారు. మన జోలికి వచ్చే వారి పేర్లు రాసి పెట్టుకోండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు నాని. అయితే ఆ వ్యాఖ్యలు నేపథ్యంలోనే తాజాగా టిడిపి నాయకులు కేసు పెట్టారు.