తెలంగాణ
Bhupalapally: పెద్దపులి సంచారం.. రోడ్డు దాటుతుండగా చూసిన స్థానికుడు

Bhupalapally: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో పెద్దపులి సంచారం సమీప గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తోంది. 22 రోజులుగా మహదేవపూర్, కాటారం రేంజ్ పరిధిలోని పులి తిరుగుతోంది. దంతలపల్లి సమీపంలో పులి రోడ్డు దాటుతుండగా స్థానికుడు గమనించాడు.
దీంతో పరిసర గ్రామ ప్రజలను భయాందోళనకు గురవుతున్నారు. ఒక చోట నుండి మరో చోటుకు పులి తన అవాసాన్ని మార్చుతుంది. దీంతో ఎప్పుడు ఎక్కడ సంచరిస్తుందో అర్ధంకాక ప్రజలు జంకుతున్నారు.