తెలంగాణ
కర్మన్‌ఘాట్ ఆలయ సమీపంలో భారీగా చేరన వరద నీరు

Rain: నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఆలయానికి వెళ్లి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఆలయ సమీపంలో బురదను తొలగించాలని డిమాండ్ చేశారు. ముందు ముందు ఇంకా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందుకు సమస్యలు పరిష్కరించాలని భక్తులు కోరారు.



