Peddi Chikiri Song: ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్.. ‘చికిరి చికిరి’ వచ్చేసింది..!

Peddi Chikiri Song: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ రిలీజై చార్ట్‌బస్టర్ అయింది. హుక్ స్టెప్స్, విజువల్స్ ఆకట్టుకున్నాయి.
రామ్ చరణ్ కంబ్యాక్ చిత్రంగా ఎంతో ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో సిద్ధమవుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్‌తో హిట్ అయింది. తాజాగా రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఏఆర్ రెహమాన్ సంగీతం ఫ్రెష్ ట్యూన్‌తో ఆకర్షించగా, జానీ కొరియోగ్రఫీ పర్‌ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది.మోహిత్ చౌహన్ చాలా అద్భుతంగా పాడారు.
సాంగ్ విజువల్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. మేకర్స్ తీసుకున్న కేర్ బాగా కనిపిస్తోంది. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్ హైలైట్‌గా నిలిచింది. ప్రోమోలో ఆకట్టుకున్న హుక్ స్టెప్స్ పూర్తి పాటలో బోలెడు సంఖ్యలో ఉండటంతో సోషల్ మీడియా షేక్ అవుతుంది. చరణ్ అభిమానులు ఆయన స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ పాట బ్లాక్‌బస్టర్ వైబ్స్ ఇస్తోంది. మొత్తంమీద ‘పెద్ది’ స్ట్రాంగ్ రీచ్ సాధించే అవకాశం ఉంది. చరణ్ మరో సిక్సర్ కొట్టినట్టు కనిపిస్తోంది.



