పవన్-లోకేష్-అనిరుద్ కాంబో లోడింగ్?

పవన్ కళ్యాణ్ తాజా సినిమా “ఓజి” బాక్స్ ఆఫీస్ వద్ద అంచనాలకు తగ్గట్టే సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తాజాగా పవన్, లోకేష్ కనగరాజ్, అనిరుద్ కాంబినేషన్ పై నెట్టింటా బజ్ నడుస్తుంది.
పవర్ స్టార్ నటించిన “ఓజి” సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించి, 300 కోట్లు దాకా రాబట్టి ఆయన కెరీర్లో మైలురాయిగా నిలిచింది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తోంది. కన్నడ టాప్ బ్యానర్ కేవిఎన్ ప్రొడక్షన్స్‌తో ఓ కొత్త సినిమా లాక్ అయినట్లు సమాచారం. ఈ నిర్మాణ సంస్థ వద్ద లోకేష్ కనగరాజ్, హెచ్ వినోద్ లాంటి దర్శకుల డేట్స్ ఉన్నాయి.
అయితే, ఫ్యాన్స్ మాత్రం పవన్, లోకేష్, అనిరుద్ కాంబినేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ టేకింగ్, అనిరుద్ సంగీతం పవన్ ఇమేజ్‌కు సరిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాక్సాఫీస్ షేక్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అయితే, ఇది కేవలం బజ్ మాత్రమే.. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఫ్యాన్స్ కల నెరవేరుతుందో లేదో చూడాలి.



