తెలంగాణ

Pawan Kalyan: ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది

Pawan Kalyan: జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ అని.. తన భావాన్నివ్యక్త పరిచారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు పవన్ కల్యాణ్.

రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేవారు పవన్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button