Pawan Kalyan: ఆపరేషన్ సిందూర్.. సెలబ్రిటీలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan: ఆపరేషన్ సిందూర్ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దేశ వ్యతిరేక పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్‌లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఆపరేషన్ సిందూర్‌ను ఉగ్రవాదంపై భారత్ గొప్ప విజయంగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్, దేశ భద్రత విషయంలో ఎవరైనా సరే సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ముఖ్యంగా సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్‌లు అవగాహన లేకుండా మాట్లాడితే చట్టపరమై “‘అవమానం’” తప్పదని స్పష్టం చేశారు. “ఇది దేశ గౌరవ ప్రశ్న. ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌కు గట్టి గుణపాఠం తప్పదు,” అని పవన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాక, సినీ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పవన్ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో దేశ వ్యతిరేక కార్యకలాపాలపై సైబర్ క్రైమ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. “పాక్ ఉగ్రవాదులకు ఇది హెచ్చరిక. భారత్ సహనాన్ని పరీక్షించొద్దు,” అని ఆయన ఉద్ఘాటించారు.