ఆంధ్ర ప్రదేశ్
Pawan Kalyan: పంటపొలాలను పరిశీలించిన పవన్‌కళ్యాణ్

Pawan Kalyan: కృష్ణా జిల్లా కోడూరు మండలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పంట నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు పవన్.
తుఫాన్ కారణంగా 274 కిమీ మేర రోడ్డు దెబ్బతిన్నాయని.. 1583 గ్రామాలపై ఈ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపినట్లు ఉన్నతాధికారులు పవన్‌కు వివరించారు. నష్టపోయిన రైతులకు ధైర్యం చెప్పి పవన్ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.



