సినిమా

Pawan Kalyan: పవర్ స్టార్ ‘ఓజి’ సెట్స్‌లోకి రీఎంట్రీ

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్! ‘ఓజి’ సినిమా షూటింగ్ మళ్లీ స్పీడ్ పెంచింది. హైదరాబాద్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న పవన్ ఊచకోతకి సిద్ధం అయ్యారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఓజి’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే సోషల్ మీడియాలో సెన్సేషన్.

షూటింగ్‌ను రీస్టార్ట్ చేసిన మేకర్స్ రేపు (మే 14) నుంచి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నారు. పవన్ తన పోర్షన్‌ను జూన్ 10లోగా పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేసింది. థమన్ సంగీతం, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించేలా కనిపిస్తోంది.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అప్‌డేట్ ట్రెండ్ సెట్ చేస్తుండగా పవన్ రీఎంట్రీతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘ఓజి’ రిలీజ్ డేట్‌పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మరి, ఈ పవర్ తుఫాన్ ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button