ఓజీ’ షూటింగ్: హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఫినిష్!

OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఓజీ’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముంబై, హైదరాబాద్, ఏపీలో జరుగుతున్న చిత్రీకరణలో పవన్ తన భాగాన్ని ఈ వారాంతంలో పూర్తి చేయనున్నారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త! ‘ఓజీ’ చిత్ర షూటింగ్ జోరుగా సాగుతోంది. దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో పవన్ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు. ముంబై, హైదరాబాద్, ఏపీలోని తాడేపల్లిలో ప్రత్యేక సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది. రాజకీయ బాధ్యతల మధ్య పవన్ తన షెడ్యూల్‌ను పూర్తి చేసేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
ఈ వారాంతంలో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో పవన్ తన భాగాన్ని ముగించనున్నట్లు సమాచారం. ఇది ‘ఓజీ’ పార్ట్ 1 షూటింగ్ పూర్తయినట్లే! ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇమ్రాన్ హష్మి విలన్‌గా, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కానుంది.