సినిమా

ఊరిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్!

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి నూతన సంవత్సరం సందర్భంగా విడుదలైన మోషన్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. గబ్బర్ సింగ్ లుక్‌ను గుర్తుచేసే మాస్ అవతారం సంచలనం సృష్టిస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్‌తో బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ జోడీ మరోసారి కలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నూతన సంవత్సర కానుకగా విడుదలైన మోషన్ పోస్టర్‌లో పవన్ రెడ్ షర్ట్, డెనిమ్‌తో గన్, రేడియో పట్టుకుని మాస్ లుక్‌లో కనిపించారు. గబ్బర్ సింగ్ స్టైల్‌ను గుర్తుచేసే ఈ లుక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. హరీష్ శంకర్ పవన్‌ను స్టైలిష్‌గా ప్రజెంట్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన తొలి సింగిల్‌కు మంచి స్పందన లభించింది. సమ్మర్‌లో ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button